

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) లాభదాయకత మెరుగుపడనుందని జేపీ మోర్గాన్ నివేదిక వెల్లడించింది. ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్‌గా విక్రయించే సంస్థల మార్జిన్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు స్థాయిలను అధిగమించాయి. కేంద్ర ఎక్సైజ్ సుంకాల తగ్గింపూ వీటికి అనుకూలంగా మారింది. అయితే పెరుగుతున్న రుణభారం, ఇంధన పన్నులపై అనిశ్చితి దీర్ఘకాలిక లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెద్దగా పెరగలేదు. మే నెలలో లీటరుకు ₹7.50 పెరిగినా, వాస్తవ వ్యయానికి తగ్గుగానే ఉన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $80 సమీపానికి తగ్గడంతో ఓఎంసీల లాభదాయకత యుద్ధానికి ముందు స్థాయిల కంటే మెరుగుపడుతోంది. ఎల్‌పీజీ నష్టాలు ఉన్నప్పటికీ త్వరలో తగ్గే అవకాశం ఉంది. బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌లలో బీపీసీఎల్, ఐఓసీలకు అధిక లాభాలు లభించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!