

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) కంపెనీలపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. తాజాగా రూ.581 కోట్లకు పైబడిన విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గోవా, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఆ గ్రూప్‌కు చెందిన భూములు మరియు ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.581.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది. ఇదే కేసులో గతంలో కూడా రిలయన్స్ గ్రూప్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వాటిని కూడా కలిపితే ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.16,310 కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!