15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోన్‌లోనే కాలర్ పేరు.. ట్రూకాలర్ అవసరం లేకుండా కొత్త సదుపాయం!

Writer: Chandrika 03:03 PM, 15 అక్టోబర్, 2026
ఫోన్‌లోనే కాలర్ పేరు.. ట్రూకాలర్ అవసరం లేకుండా కొత్త సదుపాయం!

స్పామ్ కాల్స్‌, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. థర్డ్‌పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే కాలర్ పేరు తెలుసుకునే కాలర్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సదుపాయాన్ని తప్పనిసరి చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సేవను అమల్లోకి తీసుకురావాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం ద్వారా మన ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు, టెలికాం ఆపరేటర్ సబ్‌స్క్రైబర్ డేటాబేస్‌లో నమోదైన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్‌తో పాటు డిస్‌ప్లేపై కనిపిస్తాయి. దీనివల్ల కాల్ చేస్తున్న వ్యక్తిని ముందుగానే గుర్తించే అవకాశం లభించడంతో పాటు, అవాంఛిత కాల్స్‌ను గుర్తించడంలో వినియోగదారులకు కొంతవరకు ఉపయోగపడనుంది.

ప్రాథమికంగా 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుండగా, 2జీ, 3జీ నెట్‌వర్క్‌లపై అమలుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయ కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి పేరుకు బదులుగా ‘ఇంటర్నేషనల్ కాల్’ అనే సందేశం కనిపిస్తుంది. కాల్ ముగిసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నంబర్‌ను పేరుతో సహా ఆటోమేటిక్‌గా రిట్రీవ్ చేసి సేవ్ చేసుకునే అవకాశం ఉండదు. వినియోగదారులు వివరాలను మాన్యువల్‌గా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (CLIR) సదుపాయాన్ని ఎంచుకున్న చందాదారుల పేర్లు అవతలి వ్యక్తి ఫోన్‌లో కనిపించవు. ఈ విధానం ద్వారా ప్రత్యేక యాప్‌లపై ఆధారపడకుండా కాలర్ వివరాలను తెలుసుకునే అవకాశం లభించనుంది. అయితే, ఈ సేవ పనితీరు టెలికాం సంస్థల అమలు, సబ్‌స్క్రైబర్ డేటాలోని వివరాల ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్టోబర్ 21న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం..

అక్టోబర్ 21న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం..

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

ట్యాగ్లు
సీఎన్‌ఏపీకాలర్ నేమ్ ప్రజెంటేషన్ట్రాయ్కాలర్ ఐడీగుర్తు తెలియని కాల్స్స్పామ్ కాల్స్ట్రూకాలర్ ప్రత్యామ్నాయంటెలికాం వార్తలు5జీ నెట్‌వర్క్4జీ నెట్‌వర్క్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు
జనరల్

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
జనరల్

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి
జనరల్

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్
జనరల్

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...
జనరల్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం
జనరల్

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..
రాజకీయాలు

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!
సినిమాలు

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!