
జనరల్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో బలహీనపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్ షేర్లలో అమ్మకాలు పెరగడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు రూపాయి విలువ పతనం కొనసాగుతూ ఇంట్రాడేలో 96.61 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకి చివరకు 96.52 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 114.19 పాయింట్లు నష్టపోయి 75,200.85 వద్ద ముగియగా, నిఫ్టీ 50 31.95 పాయింట్లు కోల్పోయి 23,618 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!