
క్రీడలు

ఐటీ సేవల సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ కృత్రిమ మేధ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అమెరికా సంస్థ స్పేస్‌ఎక్స్ ఇంటర్నేషనల్ తో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బీఎస్‌ఈకు తెలిపింది. ఇరు సంస్థల మధ్య సహకారం సాధ్యమైన విభాగాలను అంచనా వేయడానికి ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కేవలం వ్యాపార అవకాశాల మదింపు వరకు మాత్రమే పరిమితమని, వెంటనే ఎటువంటి లావాదేవీలు, సంయుక్త సంస్థలు లేదా పెట్టుబడి ఒప్పందాలు ఉండవని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఒప్పందం కుదిరితే, అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకుంటామని తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్ ధర 19.82% పెరిగి ₹21.64 వద్ద ముగిసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!