

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ తేదీలను కంపెనీ ప్రకటించింది. జూలై 4 నుంచి జూలై 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ప్రైమ్ యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించారు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ ఐసీఐసీఐ కార్డులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
అలాగే కొత్త మెంబర్‌షిప్ ప్లాన్ల ధరలను కూడా తగ్గించారు. స్టాండర్డ్ ప్రైమ్ ప్లాన్ రూ.1499 నుంచి రూ.999కి, ప్రైమ్ లైట్ రూ.799 నుంచి రూ.599కి, షాపింగ్ ప్లాన్ రూ.399 నుంచి రూ.299కి తగ్గించారు. ఈ ఆఫర్లు వినియోగదారులను ఆకర్షించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!