

అమెరికాతో భారత్ అత్యుత్తమ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పోటీ దేశాలతో పోలిస్తే భారత్కు అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. రాయ్సీనా డైలాగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాతో బలమైన భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా మరింత బలమైన సంబంధాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కొంతకాలం అపార్థాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినట్లే దేశాల మధ్య కూడా కొన్ని సమస్యలు రావడం సహజమని అన్నారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్కు అమెరికాతో ఉత్తమ ఒప్పందం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల వ్యాఖ్యలు చేసినట్లు గోయల్ గుర్తు చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!