

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రుణ ఎగవేతదారుల పేర్లు, మొండి బకాయిదారుల (ఎన్పీఏ) వివరాలు, బ్యాంకుల తనిఖీ నివేదికలు, విధించిన పెనాల్టీల సమాచారం వంటి కీలక అంశాలను వెల్లడించేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈ వివరాలు ప్రజలకు వెల్లడించాల్సిందేనని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టంగా ఆదేశించినప్పటికీ, వాటిని ఇవ్వడంలో బ్యాంకులు మొండికేస్తున్నాయి.
ఆర్బీఐ ఆదేశాల వల్ల తమ వ్యాపార కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)ను ఆశ్రయించాయి. ఆర్టీఐ కింద ఈ సమాచారం వెల్లడించాల్సిన అవసరం తమపై లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారాన్ని గమనించిన సీఐసీ, దీనిని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారు. ధీరజ్ మిశ్రా, వతిరాజ్, గిరీశ్ మిత్తల్, రాధా రామన్ తివారీ అనే నలుగురు వ్యక్తులు ఆర్టీఐ చట్టం కింద ఆర్బీఐ నుంచి ఈ వివరాలను కోరడంతో ఈ వివాదం మొదలైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!