

యాక్సిస్ బ్యాంక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.7,010.65 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంతో పోలిస్తే 4 శాతం అధికం. స్టాండలోన్ ప్రాతిపదికన లాభం రూ.6,489.57 కోట్లకు చేరింది. రుణాల్లో 14 శాతం వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.14,287 కోట్లుగా నమోదైంది. అయితే నికర వడ్డీ మార్జిన్ 0.29 శాతం తగ్గి 3.64 శాతానికి పరిమితమైంది. ఇతర ఆదాయం కూడా పెరిగి రూ.6,226 కోట్లకు చేరింది.
బ్యాంకింగ్ రంగ సగటును మించి వృద్ధి సాధించడమే లక్ష్యమని సీఈఓ అమితాబ్ ఛౌద్రీ తెలిపారు. రిటెయిల్ రుణాలు 6 శాతం మాత్రమే పెరగగా, చిన్న వ్యాపార రుణాలు 22 శాతం వృద్ధి చూపాయి. మొండి బకాయిలు పెరిగినా, స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.46 శాతం నుంచి 1.4 శాతానికి మెరుగుపడింది. లేబర్ కోడ్ అమలుతో బ్యాంకుపై ప్రభావం స్వల్పంగానే (రూ.25 కోట్లు) ఉందని సీఎఫ్ఓ పునీత్ శర్మ తెలిపారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వల్ల నికర వడ్డీ మార్జిన్‌పై కొంత ప్రభావం ఉండొచ్చని చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!