

కర్ణాటకలో పాల రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాల ధరను లీటరుకు రూ. 8 పెంచేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. పెంచిన మొత్తంలో రూ. 7 నేరుగా పాల రైతులకు అందించనుండగా, మిగిలిన రూ. 1ను డెయిరీ సహకార సంఘాలకు కేటాయించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం లీటరు పాలకు రైతులకు అందుతున్న రూ. 35 మొత్తం రూ. 42కు పెరగనుంది. పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా మరింత మద్దతు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న లీటరుకు రూ. 5 ప్రోత్సాహక మొత్తాన్ని కలుపుకుంటే, రైతులకు లీటరు పాలపై మొత్తం రూ. 47 అందనుంది. పాల రైతులకు మద్దతు ధర పెంచాలని వివిధ పార్టీల సభ్యులు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెరిగిన ధరలతో పాల ఉత్పత్తిదారులకు ఆదాయం పెరగడంతో పాటు, డెయిరీ సహకార సంఘాలకు కూడా అదనపు నిధులు అందనున్నాయి. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత రైతులకు లభించే ప్రయోజనాలపై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!