

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశించబోతోందన్న వార్తలను అధికారికంగా ఖండించింది. ఈ అంశంపై వస్తున్న మీడియా కథనాలు, మార్కెట్ ఊహాగానాలు నిరాధారమైనవి, అవాస్తవమైనవి అని పేర్కొంది. షెడ్యూల్డ్ విమానయాన సంస్థను ప్రారంభించడం లేదా అందులో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనను అదానీ ఎంటర్‌ప్రైజెస్ పరిశీలించడం లేదని స్పష్టంచేసింది.
ముంబయి, ఢిల్లీ వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌లో 10 శాతానికి మించిన వాటా కలిగి ఉండకూడదనే నిబంధనలో మార్పులు కోరినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది. అలాగే, భారత వైమానిక దళం కోసం AEW&C Mk-II వ్యవస్థ అభివృద్ధికి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, డీఆర్‌డీఓ మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత విమానయాన రంగ ప్రవేశంపై ఊహాగానాలు పెరిగాయి. అయితే, వాణిజ్య విమానయాన రంగంలోకి ప్రవేశించే యోచన లేదని సంస్థ మరోసారి స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!