ఎలక్ట్రిఫికేషన్ మరియు ఆటోమేషన్ రంగంలో ప్రముఖ సంస్థ ఏబీబీ ‘మేక్ ఇన్ ఇండియా’ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాలను మరింతగా విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఆధునిక పరిశోధన-అభివృద్ధి కేంద్రాలు (ఆర్ అండ్ డీ) మరియు టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక కోసం ఈ ఏడాది సుమారు 7.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.690 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
ఉత్పత్తి సామర్థ్య విస్తరణలో భాగంగా విద్యుదీకరణ, ఆటోమేషన్ పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, మెట్రో రైలు వ్యవస్థలు, డేటా కేంద్రాలకు అవసరమైన కీలక యంత్ర పరికరాలు మరియు సాంకేతిక పరిష్కారాల తయారీని పెంచనుంది. ప్రస్తుతం భారత్‌లో ఏబీబీ విక్రయిస్తున్న యంత్ర పరికరాల్లో దాదాపు 85 శాతం ఉత్పత్తులు స్థానికంగానే తయారవుతున్నాయని ఏబీబీ ఇండియా వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా ఈ ఏడాది కొత్త ఆర్ అండ్ డీ కేంద్రాలు మరియు టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది.
















.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!