

అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు, లేదా 1.5 నుండి 2 లక్షల డాలర్ల వరకు పెంచినా కంపెనీలు విదేశీ నిపుణుల నియామకాలను ఆపబోవని తాజా నివేదిక అంచనా వేస్తోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) నివేదిక ప్రకారం, హెచ్-1బీ వీసాపై వెళ్లే ఉద్యోగులు సమాన అర్హతలున్న అమెరికా పౌరులతో పోలిస్తే సగటున 16 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. మెటా, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు సుమారు 1,50,000 డాలర్ల వార్షిక వేతనం ఇస్తుండగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ సంస్థలు సుమారు 80,000 డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి.
జార్జ్ బోర్జాస్ రూపొందించిన నివేదిక ప్రకారం, హెచ్-1బీ సిబ్బందిలో 75 శాతం మంది అగ్రగామి 25 కంపెనీలకు వెలుపల పనిచేస్తున్నారు. మొత్తం 38.3 శాతం మంది సాఫ్ట్వేర్ డెవలపర్లే ఉన్నారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత అమెరికాలో కొనసాగుతున్నందున, ఫీజు పెంపు జరిగినా కంపెనీలకు దీర్ఘకాలంలో ఖర్చు ఆదా అయ్యే అవకాశముందని విశ్లేషించింది. అయితే భవిష్యత్తులో అత్యున్నత నైపుణ్యాలున్న నిపుణులకే ప్రాధాన్యత పెరిగే అవకాశముందని పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!