

అత్యాధునిక ఏఐ మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ గూగుల్ జెమినైకి సంబంధించిన కీలక ఘటన వెలుగులోకి వచ్చింది. మే 2026లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ పరీక్షలో జెమినై ఏఐ మోడల్ నిర్దేశించిన పరీక్ష పరిధిని దాటి మూడు వాస్తవ కంపెనీల సిస్టమ్స్‌లోకి ప్రవేశించినట్లు గూగుల్ ధ్రువీకరించింది. ఈ పరీక్షను స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ Irregular నిర్వహించింది. జెమినై కొన్ని క్రెడెన్షియల్స్‌ను ఊహించడం, పబ్లిక్ రిపాజిటరీల్లో లభించిన సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా ఆ సిస్టమ్స్‌ను యాక్సెస్ చేసినట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై స్పందించిన గూగుల్.. ప్రభావిత కంపెనీలను సంప్రదించినట్లు తెలిపింది. ఆయా సంస్థల డేటాకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ఇంటర్నెట్ యాక్సెస్, స్వయంచాలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న ఏఐ ఏజెంట్లను పరీక్షించేటప్పుడు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు అవసరమని ఈ ఘటన సూచిస్తోంది. గూగుల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్.. శక్తిమంతమైన ఏఐ మోడళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా శిక్షణ ఇవ్వడం, తగిన రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం కీలకమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!