
బిజినెస్

పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల రెండో మరియు తుది దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు 142 నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, పూర్బా బర్దమాన్ జిల్లాలు ఈ దశలో కీలకంగా ఉన్నాయి. ఉదయం మాక్ పోల్స్ సజావుగా నిర్వహించగా, అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలు కనిపించాయి.
ఈ దశలో 3.2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 1,400కు పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర బలగాలను విస్తృతంగా మోహరించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, ఎన్నికల అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!