
జనరల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యువతకు మరోసారి ప్రేరణగా నిలిచాడు. “మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి” అని సందేశమిస్తూ, న్యూఢిల్లీలోని డీపీఎస్ ఆర్కే పురంలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన కోహ్లీ, జీవితంలో బాల్యం ఎంతో ముఖ్యమని, అదే భవిష్యత్తుకు పునాది వేస్తుందని తెలిపారు. కష్టపడటం, క్రమశిక్షణ, అభిరుచి విజయానికి కీలకమని చెప్పుతూ, తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!