

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ప్రారంభంతో గ్లోబల్ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన, గతంలో వలసలు, నిరుద్యోగం ఎదుర్కొన్న ఉత్తరాంధ్ర ఇప్పుడు ప్రతిభకు గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ వేలాది ఉద్యోగాలను సృష్టించనుంది.
ఈ డేటా సెంటర్ 2028 నాటికి పూర్తవుతుందని, ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని సీఎం వెల్లడించారు. విశాఖలో తక్కువ వ్యయంతో వ్యాపార నిర్వహణ సాధ్యమవుతుందని, ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగై, ఏఐ ఆధారిత సేవలు విస్తరించి, విశాఖను భవిష్యత్ ఏఐ నగరంగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!