

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అధునాతన ఆయుధ వ్యవస్థల తయారీలో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) టెక్నాలజీతో అభివృద్ధి చేసిన రెండు ప్రత్యేక ఆయుధ వ్యవస్థలను తాజాగా ప్రదర్శించింది. డీఆర్‌డీఓ మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విక్రమ్ VT 21 మరియు 30mm అన్‌మ్యాన్‌డ్ టర్రెట్‌లను కంపెనీ ప్రదర్శించింది.
విక్రమ్ VT 21 అనేది యుద్ధభూమిలో సైనికులను సురక్షితంగా తరలించేందుకు రూపొందించిన ఆధునిక ప్లాట్‌ఫామ్‌గా చెప్పబడుతోంది. దీన్ని డీఆర్‌డీఓకి చెందిన వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (VRDE) డిజైన్ చేయగా, దాని అభివృద్ధి మరియు తయారీ బాధ్యతలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్వహించింది. అలాగే 30mm అన్‌మ్యాన్‌డ్ టర్రెట్ కూడా యుద్ధ పరిస్థితుల్లో సైనికుల భద్రతతో పాటు ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేలా ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!