

దేశ టెలికం రంగంలో సంచనాలతో దాదాపు గుత్తాధిపత్యం సాధించిన రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్‌పైనా కన్నేసింది. సుమారు 1,650 ఉపగ్రహాలతో నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్, ఇతర టెలికం సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ. లక్షన్నర కోట్లు (15బిలియన్ డాలర్లు) వ్యయం చేయనుంది. దీనికి అనుమతులపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం.
రిలయన్స్ సంస్థ, కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. జియో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే.. భారత డిజిటల్ సార్వభౌమత్వం పెరుగుతుందని, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు జియో గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల ఎత్తు (లోఎర్త్ ఆర్బిట్- లియో)లోకి ఉపగ్రహాలను పంపి.. వాటి సాయంతో నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలనుగానీ, ఫోన్లను గానీ వినియోగించాల్సి ఉంటుంది. శాటిలైట్ ఇంటర్నెట్‌తో నగరాలు, గ్రామీణ ప్రాంతాలనే కాదు కొం డలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్, టెలికం సర్వీసులు అందుతాయి



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!