

సోషల్ మీడియా మరియు కృత్రిమ మేధస్సు ప్రపంచంలో మరో కీలక ఒప్పందం కుదిరింది. పర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ, స్నాప్‌చాట్ యజమానులైన స్నాప్ ఇన్క్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, పర్ప్లెక్సిటీ రూపొందించిన ఏఐ సర్చ్ చాట్‌బాట్ ఇకపై స్నాప్‌చాట్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే ప్రశ్నలు అడిగి, తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 943 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్న స్నాప్‌చాట్‌కి ఇది ఒక పెద్ద అప్డేట్గా మారనుంది. స్నాప్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ మాట్లాడుతూ, “మేము ఏఐని మరింత వ్యక్తిగతం, సరదాగా, స్నేహితులతో అనుసంధానమయ్యేలా తీర్చిదిద్దుతున్నాం. పర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం ద్వారా ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం” అని తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా స్నాప్కి ఆర్థిక లాభం కూడా చేకూరనుంది. పర్ప్లెక్సిటీ సంస్థ, స్నాప్కి ఒక సంవత్సరంలో సుమారు $400 మిలియన్ (రూ.3,547 కోట్లు) చెల్లించనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో గ్లోబల్‌గా ప్రారంభమవుతుందని సమాచారం. పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రపంచంలోని జిజ్ఞాసను తీర్చడం మా లక్ష్యం. కోట్ల మంది స్నాప్‌చాట్ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మేము వారి ఆసక్తిని అదే ప్లాట్‌ఫార్మ్‌లో తీర్చబోతున్నాం” అని చెప్పారు.
స్నాప్‌చాట్ యూజర్లలో 13 నుంచి 34 ఏళ్ల వయసు గల యువత 75% ఉండటంతో, ఈ ఏఐ ఫీచర్ యువతలో కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!