

OpenAI మరియు జోనీ ఐవ్ కలిసి చేస్తున్న కొత్త ప్రాజెక్ట్‌కు “io” అనే పేరు పెట్టుకోవడం కొంతకాలం సాధ్యం కాదు. ఎందుకంటే యూస్ కోర్ట్, ఆ పేరును ఉపయోగించవద్దని ఇచ్చిన తాత్కాలిక ఆదేశాన్ని TRO కొనసాగించింది. దాదాపు ఆరు నెలల క్రితం Google’s Moonshot Factory నుంచి ఏర్పడిన ఏఐ స్టార్టప్ అయిన iyO ట్రేడ్‌మార్క్ కంప్లైంట్ ఇచ్చింది. రెండు పేర్లు వినిపించే శబ్దం ఒకేలా ఉండటం, అలాగే రెండు కంపెనీలు కూడా ఏఐ సంబంధిత ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల, కోర్ట్ iyO వాదనలు సమర్థించింది.
డిసెంబర్ 4న విడుదల చేసిన కోర్ట్ డాక్యుమెంట్స్ ప్రకారం, OpenAI మరియు వారి భాగస్వామ్య కంపెనీలు “io” బ్రాండింగ్‌తో హార్డ్‌వేర్ లేదా ప్రమోషనల్ మెటీరియల్స్ చేయకూడదని Ninth Circuit కోర్ట్ స్పష్టం చేసింది. iyO తమ కంప్లైంట్ లో, “రివర్స్ కన్ఫ్యూజన్" జరుగుతోందని పేర్కొంది అంటే పెద్ద కంపెనీ పేరు చిన్న అసలైన కంపెనీ పేరును దాచేస్తుంది, పబ్లిక్‌లో కన్ఫ్యూజన్ కలుగుతుంది. ప్రొడక్ట్ సేల్స్ లేకపోయినా, OpenAI వీడియోల్లో, ప్రమోషనల్ మెటీరియల్స్‌లో “io” పేరు వాడటం చట్టపరంగా ట్రేడ్‌మార్క్ యూజ్‌గానే పరిగణిస్తామని కోర్ట్ చెప్పింది.
దీని ఫలితంగా, OpenAI మరియు జోనీ ఐవ్ జాయింట్ వెంచర్ “io” అనే పేరును ఏఐ ఆధారిత వాయిస్ ఇంటర్ఫేస్ హార్డ్‌వేర్‌కు ఉపయోగించకూడదు. ఇప్పటికే ఈ సంబంధిత ప్రమోషనల్ పేజీలు మరియు వీడియోలను కంపెనీ తీసేసింది. అయితే ఈ TRO ప్రభావం కేవలం ఏఐ వాయిస్ కంప్యూటింగ్ డివైసులకే వర్తిస్తుంది. ఇతర రంగాల్లో “io” పేరు వాడడాన్ని ఇది ఆపదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!