

గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్‌ను కొత్త వీడియో జనరేషన్, ఎడిటింగ్ సామర్థ్యాలతో విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న వీడియోను పొడిగించే సమయంలో ఈ మోడల్ గతంలో ఉన్న ఒక సెకను ఫుటేజ్‌కు బదులుగా 10 సెకన్ల వరకు ముందున్న దృశ్యాలను విశ్లేషించగలదు. 10 సెకన్ల చొప్పున వీడియోను పొడిగించుకునే అవకాశం ఉండగా, మొత్తం 40 సెకన్ల వరకు ఎక్స్‌టెన్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.
వీడియో ప్రారంభం, ముగింపు ఫ్రేమ్‌లను నిర్దేశించి వాటి మధ్య అవసరమైన దృశ్యాలను కూడా రూపొందించవచ్చు. కెమెరా మూవ్‌మెంట్స్, జూమ్‌లు వంటి క్లిష్టమైన కదలికలకు సపోర్ట్‌తో పాటు మూడు సెకన్ల వరకు రిఫరెన్స్ వీడియోను ఉపయోగించుకునే అవకాశం ఉంది. వేగంగా ఐడియాలను పరీక్షించేందుకు 360p ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఫైనల్ వీడియోలను 1080p లేదా 4Kలో రూపొందించుకోవచ్చు. డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్లకు Google Flow, Gemini యాప్‌లోనూ ఈ మోడల్ అందుబాటులో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!