

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో సెప్టెంబర్ 19న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ పీవీ మోహన్ హాజరయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో పనిచేయాలని షర్మిల సూచించారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు పార్టీలోని అంతర్గత గ్రూపు రాజకీయాలకు ముగింపు పలకాలని ఆమె కోరారు. కాంగ్రెస్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. పీవీ మోహన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రావడాన్ని స్వాగతించిన షర్మిల.. ఆయన సీనియారిటీ, సూచనలు, సలహాలతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!