

గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం భారీ కృత్రిమ మేధస్సు అప్డేట్ను ప్రకటించింది. జెమినీ ఇంటెలిజెన్స్ పేరుతో కొత్త సదుపాయాలను త్వరలో ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సదుపాయంతో వినియోగదారులు ఫోన్ ద్వారా పనులను ఆటోమేటిక్‌గా చేయించుకోవచ్చు. ఫోటోలు, స్క్రీన్ వివరాల ఆధారంగా ప్రయాణ ప్రణాళికలు, షాపింగ్ జాబితాలు, వెబ్సైట్ వివరాలను సులభంగా నిర్వహించుకోవచ్చు.
ఇక ఆండ్రాయిడ్‌లోని క్రోమ్ బ్రౌజర్లో కూడా జెమినీ సేవలను గూగుల్ తీసుకురానుంది. వెబ్ పేజీల సారాంశం చెప్పడం, వేర్వేరు వెబ్సైట్ల వివరాలను పోల్చి చూపించడం వంటి పనులు ఈ కృత్రిమ మేధస్సు చేయనుంది. అదనంగా వినియోగదారులు తమకు కావాల్సిన విడ్జెట్లను మాటలతో చెప్పి సృష్టించుకునే అవకాశం కూడా ఉండనుంది. వ్యక్తిగత గోప్యత కోసం ఏ యాప్‌లకు అనుమతి ఇవ్వాలో వినియోగదారులే నిర్ణయించుకోవచ్చని గూగుల్ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!