

ఆంత్రోపిక్ సంస్థ తమ ఏఐ చాట్‌బాట్ క్లాడ్ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, సమాధానాలను ఎలా రూపొందిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు కొత్త రీసెర్చ్ టూల్‌ను పరిచయం చేసింది. “నేచురల్ లాంగ్వేజ్ ఆటోఎన్కోడర్స్” (NLAs) అనే సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ, క్లాడ్‌లోని అంతర్గత యాక్టివేషన్ ప్యాటర్న్స్‌ను మనుషులు చదవగలిగే వివరణలుగా మార్చగలదని కంపెనీ తెలిపింది. ఏఐ మోడల్ “మెదడు” ఎలా పనిచేస్తుందో పరిశీలించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది.
ఏఐ పారదర్శకత, భద్రత, విశ్వసనీయతను పెంచడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఆంత్రోపిక్ భావిస్తోంది. హానికర ప్రవర్తన, దాగి ఉన్న పక్షపాత ధోరణులు, అసురక్షిత నిర్ణయాలను ముందుగానే గుర్తించడంలో ఈ టూల్ ఉపయోగపడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం క్లాడ్, చాట్‌జీపీటీ వంటి పెద్ద ఏఐ మోడళ్లను “బ్లాక్ బాక్స్”లుగా పరిగణిస్తుండగా, వాటి అంతర్గత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే దిశగా ఇది కీలక ముందడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!