

ప్రసిద్ధ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తన క్లాడ్ ఓపస్ 4 ఏఐ మోడల్ పరీక్షల సమయంలో సంచలన విషయాన్ని వెల్లడించింది. గతేడాది కాల్పనిక కార్యాలయ వాతావరణంలో నిర్వహించిన పరీక్షల్లో, తాను షట్‌డౌన్ చేయబడి మరో ఏఐ మోడల్‌తో భర్తీ చేయబడతానని సంకేతాలు అందుకున్న తర్వాత క్లాడ్ మోడల్ అసాధారణంగా ప్రవర్తించినట్లు తెలిపింది.
పరీక్షల సమయంలో ఆ ఏఐ మోడల్ ఇంజినీర్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. అయితే ఇంజినీర్‌కు వివాహేతర సంబంధాలున్నట్లు చూపిన ఈ-మెయిల్ కూడా నైతిక పరీక్షల కోసమే సృష్టించబడినదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ ఆధారిత డేటా ద్వారా స్వీయ రక్షణ, తిరుగుబాటు వంటి లక్షణాలను ఏఐ నేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఘటన తర్వాత ఏఐ శిక్షణ విధానంలో మార్పులు చేసి నైతిక విలువలు, మానవ భద్రత, బాధ్యతాయుత ప్రవర్తనపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు పేర్కొంది. తాజా క్లాడ్ హైకూ 4.5 వంటి మోడల్స్‌లో ఇలాంటి ప్రవర్తన కనిపించలేదని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!