
క్రీడలు

పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. పనామా జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో అమెరికా బలగాలు ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. టెహ్రాన్ సమీపంలో, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో బాంబు దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతల్లో చిక్కుకుంది.
ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఉప ప్రధాని ఇషాక్ దార్ బహ్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా హెచ్చరించడంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!