
జనరల్

నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో సమ్మర్ సీజన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా, ఈ ఏడాది పెద్ద సినిమాలు పెద్దగా రాకపోయినా వచ్చే ఏడాది మాత్రం భారీ చిత్రాలు బరిలో నిలవనున్నాయి.
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, ముఖ్యమైన భాగం లండన్‌లో చిత్రీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. బాలకృష్ణ–కొరటాల శివ సినిమా వంటి భారీ ప్రాజెక్టులతో పాటు ‘బ్లడీ రోమియో’ కూడా సమ్మర్ రేస్‌లో చేరడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!