
సినిమాలు

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా బోర్డు ముంబయిలో కీలక సమావేశం నిర్వహించనుంది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఖర్చులు తగ్గింపు, తదుపరి సీఈఓ ఎంపిక ప్రధాన అంశాలుగా ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, గగనతల సమస్యలు, ఆర్థిక ఒత్తిడి కారణంగా సంస్థ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.
విమాన టికెట్ ధరల నుంచి మీల్స్ వేరు చేయడం, బిజినెస్ క్లాస్ లాంజ్ సదుపాయాలను ఐచ్చికంగా మార్చడం వంటి మార్పులు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత సీఈఓ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త నాయకత్వంపై చర్చ జరగనుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ సహా యూరోపియన్ ఎగ్జిక్యూటివ్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!