
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై మరో న్యాయపోరాటం మొదలైంది. భారత్ సహా 60 దేశాలపై 12.5 శాతం వరకు సుంకాలు విధించే నిర్ణయాన్ని సవాలు చేస్తూ 25 అమెరికా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. సుంకాలు విధించే విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని దాటారని రాష్ట్రాలు ఆరోపించాయి.
వెట్టిచాకిరీని అడ్డుకోవడంలో పలు దేశాలు విఫలమయ్యాయని పేర్కొంటూ ట్రంప్ ఈ సుంకాల విధానాన్ని సమర్థించారు. అయితే, అధ్యక్షుడికి ఇలాంటి విస్తృత వాణిజ్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పిటిషన్‌లో రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారం అమెరికా వాణిజ్య విధానంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!