

సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌ల సమస్య తీవ్రంగా మారుతోంది. సినిమా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను మార్చి నకిలీ కంటెంట్ సృష్టించడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తన రూపాన్ని అనుమతి లేకుండా వాడుతున్న వారిపై తీవ్రంగా స్పందించారు. ఏఐ ద్వారా ఇతరుల రూపాన్ని వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలను అస్సలు సహించబోమని ఆమె స్పష్టం చేశారు.
తన ఫోటోలు, వీడియోలను మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ, వెంటనే ఈ కార్యకలాపాలను ఆపాలని సూచించారు. ఇకపై తన పేరు, రూపాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో రష్మిక మందన్నతో పాటు పలువురు నటీనటులు కూడా డీప్‌ఫేక్‌లపై కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృణాళ్ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!