
జనరల్

దేశంలో ఏఐ రంగంలో భారీ అవకాశాలున్నప్పటికీ నైపుణ్యాల కొరతే అతిపెద్ద సవాలుగా మారిందని సేల్స్ఫోర్స్ దక్షిణాసియా సీఈఓ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం 6 లక్షలకు పైగా ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా, 4.2 లక్షల మందికే సరైన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. 2027 నాటికి భారత్లో 12.5 లక్షల ఏఐ నిపుణులు అవసరమని అంచనా ఉందన్నారు.
ఈ లోటును భర్తీ చేసేందుకు 2030 నాటికి 10 లక్షల మందికి ఉచితంగా ఏఐ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఇండియా ఏఐ మిషన్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ 10 ఏళ్లలో 500 నుంచి 4,000 ఉద్యోగాల స్థాయికి పెరిగిందని వెల్లడించారు. పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యంతో డిజిటల్, క్లౌడ్, ఏఐ నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!