

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య చండీగఢ్ వేదికగా గురువారం రెండో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా విజయం సాధించగా, భారత్ దారుణంగా ఓడిపోయింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది భారత్.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. లోకల్ బాయ్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, భారత క్రికెట్ సభ్యులతో సందడి చేశారు. గ్రౌండ్ లో భారత ప్లేయర్లకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో కాస్త క్లోజ్ గా కనిపించారు.
2011 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్ లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో, టైటిల్ భారత్ కు దక్కింది. అటు 2007 వరల్డ్ కప్ సమయంలో కూడా ఈ ఇద్దరు ఆడారు. ఇందులో భాగంగానే ఇద్దరు నిన్నటి మ్యాచ్ సందర్భంగా క్లోజ్ గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.






.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!