

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 8 వ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బలమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి ఈ సీజన్లో తన తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్, ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. నాట్ స్కివర్-బ్రంట్ (65) అద్భుతమైన అర్ధశతకంతో జట్టును నిలబెట్టగా, అమన్‌జ్యోత్ కౌర్ (38), నికోలా కేరీ (32 నాటౌట్) కీలక పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో హర్లీన్ డియోల్ (62) 12 ఫోర్లతో ముంబై బౌలర్లను శ్రమింపజేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (25), క్లో ట్రయాన్ (21 నాటౌట్) మద్దతుతో యూపీ 17.4 ఓవర్లలో 165/3 చేసి విజయం సాధించింది. కీలక హాఫ్ సెంచరీతో హర్లీన్ డియోల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!