

మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగింపుకు దగ్గర పడుతుండటంతో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోరు తీవ్రతరమైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు, +0.947 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి.

వరుస విజయాలతో పుంజుకున్న గుజరాత్ జెయింట్స్ 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్ 6 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. యూపీ వారియర్స్ 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉండగా, నేడు వడోదరలో జరిగే ఆర్సీబీతో మ్యాచ్ వారికి చావోరేవో పోరుగా మారింది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, రెండో మరియు మూడో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5 న వడోదరలో గ్రాండ్ ఫైనల్ జరగనుంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!