

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ (MI) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో ఓటమిగా నమోదైంది.
వడోదరలోని కోతంబి స్టేడియంలో జరిగిన 16వ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. నాట్ సీవర్-బ్రంట్ 57 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 100 పరుగులు చేసి డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి శతకం నమోదు చేసింది. హేలీ మాథ్యూస్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. రిచా ఘోష్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 90 పరుగులు చేసి పోరాటం చేసినప్పటికీ ఫలితం మార్చలేకపోయింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, అమేలియా కెర్, హేలీ మాథ్యూస్ కీలక వికెట్లు పడగొట్టారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!