

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో నట్ సీవర్ బ్రంట్ 65 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 41 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో శ్రీ చరణి 3 వికెట్లతో కీలక పాత్ర పోషించింది.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. షఫాలీ వర్మ 29, లిజెల్లీ లీ 46 పరుగులతో తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అనంతరం కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివర్లో మరిజన్ కాప్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో ఢిల్లీ 19 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఢిల్లీ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్స్ రేసులో నిలవగా, ముంబైకి ఇది ఈ సీజన్లో నాలుగో ఓటమిగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!