

మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో దిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, ముంబై ఇండియన్స్ మరియు యూపీ వారియర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 122 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం దిల్లీ 18.4 ఓవర్లలో 126 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

యూపీ బ్యాటింగ్‌లో దీప్తి శర్మ (24), సిమ్రన్ షైక్ (22), శిఖా పాండే (23*) మాత్రమే రాణించారు. దిల్లీ బౌలర్లలో మారిజేన్ కాప్ మూడు వికెట్లు పడగొట్టగా, శ్రీ చరణి మరియు చినెల్లీ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో లారా వోల్వార్ట్ (47), షెఫాలీ వర్మ (29) శుభారంభం ఇవ్వగా, చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (34*) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపుతో దిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరగా, గుజరాత్ జెయింట్స్ రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్–గుజరాత్ జెయింట్స్ తలపడనుండగా, విజేత జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!