
న్యూస్

భారత-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కివీస్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించగా, సిరీస్‌కు ముందు స్టార్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడి సిరీస్ నుంచి దూరమయ్యాడు.
అయితే మ్యాచ్ మధ్యలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. కేవలం 5 ఓవర్ల బౌలింగ్ చేసి మైదానాన్ని వదిలిన సుందర్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశారు. సుందర్ బ్యాటింగ్ సమయంలో కూడా క్రీజులో ఇబ్బంది పడుతూ కనిపించాడు. రాబోయే మ్యాచ్‌లో సుందర్ బరిలోకి దిగుతాడా లేదా సిరీస్ మొత్తానికి దూరమవుతాడా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!