

సౌతాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను టీం ఇండియా కైవసం చేసుకుని హోటల్లో విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా వన్డేల్లో తొలి శతకం సాధించిన యశస్వి జైస్వాల్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం సహచరులకు కేక్ పంపిణీ చేశారు. కేక్ తినడానికి విరాట్ కోహ్లీ ముందుకు రాగా, రోహిత్ శర్మ మాత్రం దానిని సున్నితంగా తిరస్కరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యశస్వి కేక్ తినిపించేందుకు రోహిత్ దగ్గరికి వెళ్లగానే, “మళ్లీ లావైపోతాను. స్ట్రిక్ట్ డైట్. నాకొద్దు..” అంటూ నవ్వుతూ ముందుకు సాగాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా, అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. కఠినమైన డైట్ పాటిస్తూ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి మరింత ఫిట్‌గా మారాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!