

మైదానంలో బౌలర్ల పై ఆధిపత్యం చెలాయించే యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి పోటీ పిచ్ పై కాదు, పరీక్షా హాల్లో. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఈ నెల 17 న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నాడు. బ్యాట్ పక్కనపెట్టి పెన్ను పట్టి విద్యార్థిగా తన బాధ్యతను నిర్వర్తించబోతున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఆడినా, వైభవ్ ముందుగా మా పాఠశాల విద్యార్థే. అతను పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు. అతని రాక కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైభవ్ ప్రముఖ క్రీడాకారుడిగా ఎదగడంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశాం అని పొదార్ అంతర్జాతీయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీల్ కిశోర్ తెలిపారు.
ఇటీవల భారత అండర్-19 జట్టు ప్రపంచకప్ విజయంలో వైభవ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మైదానంలోనే కాకుండా చదువులోనూ తన ప్రతిభను చాటాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!