

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో ఆమెకు స్థానం లభించింది. ప్రపంచ క్రీడారంగంపై విశేష ప్రభావం చూపిన అథ్లెట్లు, కోచ్‌లు, ఇన్వెస్టర్లను ఈ జాబితాలో ఎంపిక చేయగా, అందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు.
మహిళా క్రికెట్ అభివృద్ధికి ఆమె అందించిన సేవలు, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు, అభిమానుల్లో సంపాదించిన విశేష ఆదరణ ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. ఈ జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు కూడా చోటు దక్కించుకున్నారు. స్మృతి మంధానకు లభించిన ఈ గౌరవం భారత క్రీడారంగానికి గర్వకారణంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!