

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా, సిరీస్‌లో 2–0 ఆధిక్యం లక్ష్యంగా నేడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమిష్టిగా రాణించిన భారత్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు తొలి ఓటమి నుంచి కోలుకుని సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది.
భారత జట్టులో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రభావవంతంగా రాణించాడు. పాండ్యా క్రీజ్‌లో ఉన్నంత సేపు జట్టుకు బలం చేకూర్చగా, ఫినిషర్‌గా రింకూ సింగ్ మరోసారి తన సత్తా చాటాడు. అయితే సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్ ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, బుమ్రాపై ఆశలు ఉండగా, స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. అటు న్యూజిలాండ్ జట్టులో కాన్వే, రచిన్, రాబిన్సన్లపై బాధ్యత పెరిగింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున టాస్ కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!