

టీ20 ప్రపంచకప్ 2026 లో శ్రీలంక జట్టు ప్రయాణం ముగిసింది. సూపర్ 8 దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ పై పోరాడినా విజయం సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్యాండీలోని పల్లెకేలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక చివరి ఓవర్ల వరకు పోరాటం చేసింది. కెప్టెన్ దాసున్ షనక 76 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే చివరికి శ్రీలంక 207 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఫలితంతో మెరుగైన నెట్ రన్‌రేట్ లేకపోవడంతో పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి బయటపడింది.
మ్యాచ్ అనంతరం షనక మాట్లాడుతూ, విజయం అంచుల వరకు వెళ్లి ఓడిపోయాం. మ్యాచ్‌ను నేను ముగించాల్సింది. కానీ అది సాధ్యపడలేదు. చివరి ఓవర్లో షాహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని తెలిపారు. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరారు.
ఈ టోర్నీ తమకు కఠినంగా సాగిందని, కీలక ఆటగాళ్ల గాయాలు జట్టు పై ప్రభావం చూపాయని షనక వెల్లడించారు. ముఖ్యంగా ఇద్దరు ప్రధాన బౌలర్లు దూరం కావడం పెద్ద లోటుగా మారిందన్నారు. వారు అందుబాటులో ఉన్నట్లయితే సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
అయితే, యువ ఆటగాళ్లు పవన్ రత్నాయకే మరియు దునిత్ వెల్లలాగే మంచి ప్రదర్శన చేయడం సానుకూల అంశమని పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (1)
శ్రీలంక ఫ్యాన్స్ సారీ చెప్పిన కెప్టెన్