
జనరల్

ISSF ప్రపంచ కప్-2026 షూటింగ్ పోటీల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఇషా సింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషా 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత షూటింగ్ క్రీడా చరిత్రలో ఈ విజయం చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షలాది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం ప్రశంసించారు. ఆమె అద్భుత ప్రదర్శన భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో ఇషా మరెన్నో విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!