

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ రోజు (బుధవారం) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 909 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇంగ్లాండు ఆటగాడు ఫిల్ సాల్ట్ 821 పాయింట్లతో రెండో స్థానంలో, పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ 769 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఏడు స్థానాలు ఎగబాకి 25 వ ర్యాంకుకు చేరుకున్నారు.
బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరుకున్నారు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 11 వ ర్యాంకులో నిలిచారు. మరోవైపు, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!