

భారత్–దక్షిణాఫ్రికా మధ్య మూడో, నిర్ణయాత్మక వన్డే నేడు విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో, ఈరోజు గెలిచిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. టెస్ట్ సిరీస్‌లో ఓటమి చెందడంతో బాధపడుతున్న టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
విశాఖ గణాంకాలు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ భారత్ ఇప్పటివరకు పది వన్డేలు ఆడగా ఏడింటిలో గెలుపొందగా, రెండింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ రికార్డులు భారత్‌కు పెద్ద బూస్ట్‌గా మారే అవకాశముంది.
ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండటం మరో ముఖ్య అంశం.
భారత్ జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు ఉండే అవకాశం ఉంది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
అతని ప్రవేశంతో ఎవరిని బయటకు పంపాలనే దాని పై చర్చలు జరుగుతున్నాయి. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్థానంలో నితీష్ రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రిషబ్ పంత్ కూడా ఫైనల్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
ఏ మార్పులైనా, భారత్ ఈ మ్యాచ్ కోసం అత్యుత్తమ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుందని జట్టు వర్గాలు తెలిపాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!