
టెక్నాలజీ

టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 దశకు చేరుకున్న టీమిండియా తన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఈ నెల 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది.
సూపర్-8 దశలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బలమైన ప్రత్యర్థులైన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లపై టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో ఆసక్తి నెలకొంది. ఈ మూడు మ్యాచ్‌ల ఫలితాలు సెమీఫైనల్ అవకాశాలపై కీలక ప్రభావం చూపనున్నాయి. టీమిండియా ఇటీవల మంచి ఫామ్‌లో ఉండటంతో అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యంగా ఉన్న భారత జట్టు సూపర్-8 దశలోనూ అదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!