
.jpg&w=3840&q=75)
టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకపై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (23), రాచిన్ రవీంద్ర (32), గ్లెన్ ఫిలిప్స్ (18) ప్రారంభంలో మంచి స్కోరు చేయగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 26 బంతుల్లో 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన ముగింపు ఇచ్చాడు. కోల్ మెక్కాంచీ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, దుష్మంత చమీర తలో మూడు వికెట్లు సాధించారు.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పాథుమ్ నిస్సాంక మొదటి బంతికే అవుట్ అయ్యాడు. కుసాల్ మెండిస్ (11), చరిత్ అసలంక (5), పవన్ రత్నాయకే (10) త్వరగా పెవిలియన్ చేరడంతో శ్రీలంక ఇబ్బందుల్లో పడింది. కమిందు మెండిస్ 31 పరుగులు చేసి పోరాడినా, మిగతా బ్యాటర్లు పెద్దగా సహకరించలేకపోయారు. చివరికి శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులకే పరిమితమైంది.
న్యూజిలాండ్ బౌలింగ్‌లో రాచిన్ రవీంద్ర 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పాడు. మ్యాట్ హెన్రీ 2 వికెట్లు, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ సాధించారు. శ్రీలంక పవర్‌ప్లేలో కేవలం 20 పరుగులే చేయగలగడం మ్యాచ్‌కు కీలక మలుపు అయ్యింది. నెట్ రన్ రేట్ పరంగా కూడా ఈ భారీ ఓటమి వారికి తీవ్ర దెబ్బగా మారింది.
ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2015 తర్వాత ఏ ఐసీసీ మెగా టోర్నీలోనూ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన శ్రీలంకకు ఇది మరో నిరాశ. వరుసగా 2015 వన్డే వరల్డ్ కప్ నుంచి 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సెమీస్ చేరలేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!