

టీ20 వరల్డ్ కప్ 2026లో ఈరోజు సూపర్ 8 గ్రూప్ 1లో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వే–దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే, ఏయిడెన్ మార్క్రం కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికాను ఎదుర్కొననుంది. ఈ మ్యాచ్ గ్రూప్ పాయింట్ల పట్టికలో కీలక ప్రభావం చూపనుంది.
అయితే అసలు హైలైట్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న భారత్–వెస్టిండీస్ పోరు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా, షాయ్ హోప్ కెప్టెన్సీలోని వెస్టిండీస్‌ను ఎదుర్కొననుంది. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లతో భారత్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు హెట్మేయర్, పౌవెల్ వంటి హిట్టర్లతో వెస్టిండీస్ సవాల్ విసరనుంది. సెమీఫైనల్ రేసులో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!